: కాంగ్రెస్ యువరాజు రాహుల్ ఏప్రిల్ 19న వస్తున్నాడట!


సుదీర్ఘ సెలవులో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే స్వదేశానికి తిరిగి రానున్నారు. విశ్రాంతి నిమిత్తం వ్యక్తిగత పర్యటనకు విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ వచ్చే నెల 19న ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కిసాన్ మొర్చా నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. రాహుల్ రాకపై డిగ్గీరాజా స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు కూడా రాహుల్ హాజరవుతారని ఆయన తెలిపారు. విశ్రాంతి కాలంలో ప్రశాంతంగా గడిపిన రాహుల్, ఎక్కుపెట్టిన బాణంలా తిరిగి వస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, మే 8న రాహుల్ మహారాష్ట్రలో ఓ కోర్టులో హాజరుకావాల్సిన ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News