: ఇరాన్ అణు ఒప్పందం యెమెన్ దురాక్రమణకు దారితీస్తుంది: నెతన్యాహూ
ఇరాన్ తో చేసుకునే అణు ఒప్పందం యెమెన్ దురాక్రమణకు దారితీసే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెరూసలెంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ తో అగ్రరాజ్యాలు కుదుర్చుకునే ఒప్పందం పరోక్షంగా యెమెన్ ఆక్రమణకు దారితీసే అవకాశం ఉందని, అదే జరిగితే చూస్తూ ఊరుకోమని అన్నారు. యెమెన్ లో షియా తిరుగుబాటు దారులకు ఇరాన్ మద్దితిస్తోంది. తాజా ఒప్పందంతో షియాలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తరువాత చోటుచేసుకునే ఎలాంటి పర్యవసానాలకైనా తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా, స్విట్జర్లాండ్ తో ఇరాన్ అణు కార్యక్రమంపై ఆ దేశంతో అగ్రరాజ్యాలు చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్ తో శాంతియుత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నెతన్యాహూ వ్యాఖ్యలు భవిష్యత్ పరిణామాలపై ఆసక్తి రేపుతున్నాయి.