: ఆత్మహత్య చేసుకుంటానంటూ మందుబాబు హల్ చల్
ఆత్మహత్య చేసుకుంటానంటూ వరంగల్ లో ఓ మందుబాబు స్థానికులకు చెమటలు పట్టించాడు. రాజేష్ (26) అనే వ్యక్తికి గతకొన్ని రోజులుగా భార్యతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజేష్ పూటుగా తాగేసి భార్యవద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకోబోయాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని అడ్డుకుని, కిందికి దించారు. వెంటనే పక్కనే దసరా రోడ్డులో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. దీంతో, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగప్రవేశం చేసి, అతడిని కిందికి దించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.