: అమిత్ షాతో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు హరిబాబు, మాణిక్యాలరావు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులు నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వీరు చర్చించారు. ఏపీలో బీజేపీని పటిష్ఠపరచడం, సభ్యత్వ నమోదుపై వారు చర్చించారు.