: రైల్వే డ్రైవర్లపై పగబట్టిన బీహార్ కోతి


కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడన్న వాదన తెలిసిందే. అలాగే, కోతి కూడా మనిషిలాగే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు పలు సందర్భాల్లో చెబుతుంటారు. బీహార్ లో ఓ కోతి ఈ విషయాన్ని రుజువు చేయాలని భావించినట్టుంది. గత వారం పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మీకి రైల్వే స్టేషన్ వద్ద ఓ కోతి గూడ్స్ రైలు కిందపడి మృతి చెందింది. దానిని చూసిన కోతి తోబుట్టువు రైల్వే డ్రైవర్లపై పగబట్టింది. దీంతో, స్టేషన్ లో గూడ్స్ ఆగిందంటే చాలు డ్రైవర్ పై దాడికి దిగుతోంది. ఇద్దరు డ్రైవర్లపై ఆ కోతి దాడికి దిగగా, దాని బారినుంచి వారిని సహోద్యోగులు రక్షించారు. మరో డ్రైవర్ పై దాడికి దిగడంతో అతను క్యాబిన్ లోపల దాక్కుని బతికిపోయాడు. ఇప్పుడక్కడ గూడ్స్ ఆపాలంటేనే డ్రైవర్లు భయపడుతున్నారట.

  • Loading...

More Telugu News