: రాష్ట్రపతి భవన్ లో మోదీ, కేజ్రీవాల్ మాటామంతీ... ఆరోగ్యం గురించి ఆరా


ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు పరస్పరం కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీ ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈరోజు పద్మ పురస్కారాల కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర మంత్రుల సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిశాక మోదీ, కేజ్రీ కరచాలనం చేసుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. ఇదే సమయంలో ఆరోగ్యం గురించి ప్రధాని అడగ్గా, తాను బాగానే ఉన్నానని కేజ్రీ తెలిపారు. తీవ్ర దగ్గు, మధుమేహం కారణంగా కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్న కేజ్రీకి ఆ మధ్య బెంగళూరు వెళ్లి చికిత్స తీసుకోమని ప్రధాని మోదీనే సలహా ఇచ్చారు. దాంతో, బెంగళూరు వెళ్లిన కేజ్రీ పది రోజుల పాటు నేచురోథెరపీ చేయించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News