: భారత్ అభివృద్ధి చెందితే...మరో ఏడు దేశాలు అభివృద్ధి చెందుతాయి: పాక్ హైకమిషనర్


వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 8 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు, అగ్రదేశాలు వేస్తున్న అంచనాలపై పాకిస్థాన్ హై కమిషనర్ అబ్ధుల్ బాసిత్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ఆర్ధికాభివృద్ధి సాధిస్తే ఆ ప్రభావం సార్క్ దేశాలన్నింటిపైనా చూపిస్తుందని అన్నారు. దీంతో సార్క్ దేశాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక దేశాలు సార్క్ దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News