: 3 నిమిషాల పాటు లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి నాయిని, డిప్యూటీ సీఎం అలీ
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఉపముఖ్యమంత్రి మహ్మద్ అలీలు లిఫ్టులో ఇరుక్కుపోయారు. హైదరాబాదులోని 'అమ్మ' ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వారిద్దరూ వెళ్లారు. అక్కడ లిఫ్టు ఎక్కారు. సాంకేతిక సమస్య కారణంగా మధ్యలోనే లిఫ్టు ఆగిపోయింది. దాంతో నాయిని, అలీలు మూడు నిమిషాల పాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వెంటనే ఆసుపత్రి వారు, భద్రతా సిబ్బంది లిఫ్టు సమస్యను గుర్తించడంతో వాళ్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.