: పెళ్లిళ్లపై పుస్తకం రాయనున్న అమితాబ్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త అవతారం ఎత్తనున్నారు! విభిన్నమైన పాత్రలతో తనలోని నటుడిని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న 'బిగ్ బి' దృష్టి ఇప్పుడు రచనా వ్యాసంగం వైపు మళ్లింది. త్వరలోనే ఆయనో పుస్తకం రాయనున్నట్టు అర్థమవుతోంది. వివాహం అనేది ఓ వ్యవస్థ అని, గోవాలో బెంగాలీ కుటుంబ వివాహం... ఇలాంటివి తనను ఆకట్టుకుంటాయని ట్విట్టర్లో తెలిపారు. పెళ్లిళ్లే ఇతివృత్తంగా తానో పుస్తకం రాయాల్సి వచ్చేట్టుందని ఆయన ట్వీట్ చేశారు. అన్నట్టు... అమితాబ్ ఇటీవలే క్రికెట్ వరల్డ్ కప్ లో కామెంటరీ చెప్పి, తనకు ఆ ఫీల్డ్ కొత్త అయినా, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో రైటర్ గానూ ఆయన మెప్పించడం ఖాయమని అంటున్నారు.