: జేసీ దివాకర్ రెడ్డి నేతృత్వంలో పులివెందుల కెనాల్ కు గండి కొట్టిన స్థానికులు
పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం వద్ద స్థానికులు గండి కొట్టారు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, విప్ యామిని బాల నేతృత్వంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కెనాల్ కు గండికొట్టబోతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, తాగునీటి అవసరాల కోసమే నీటిని మళ్లిస్తున్నామని చెప్పారు. జేసీ మాటలతో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.