: మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలపై లోకాయుక్త విచారణ
మంత్రి జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల్లో అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుపై ఈరోజు విచారణ మొదలైంది. ఈ క్రమంలో పొన్నం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. కానీ, ఈ కేసులో ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కేసులో నివేదిక సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కోరిన ఉన్నతాధికారుల విజ్ఞప్తిని లోకాయుక్త తిరస్కరించింది. ఈ మధ్యాహ్నం విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందేనని ఉన్నతాధికారులను ఆదేశించింది.