: రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి: రాజ్ నాథ్ కు తెలిపిన గవర్నర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని హోం మంత్రికి తెలిపారు. అభివృద్ధి పరంగా కూడా రెండు రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. రాజ్ నాథ్ తో సమావేశం అనంతరం నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ, హోం మంత్రితో భేటీ కావడం సాధారణ అంశమే అని చెప్పారు. పునర్విభజన చట్టంలో సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు.