: యూపీ ప్రొవిన్షియల్ సివిల్స్ ఎగ్జామ్ పేపర్ లీక్... వాట్స్ యాప్ వేదికగా రూ.5 లక్షలకు విక్రయం
ప్రశ్నాపత్రాల లీకుల జోరు కొనసాగుతోంది. నిన్నటికి నిన్న సోషల్ నెట్ వర్క్ సైట్ల ఆధారంగా ఆంధ్ర వర్సీటీ పరీక్షా పేపర్లు లీక్ కాగా, తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసు ప్రిలిమ్స్ పేపర్ కూడా పరీక్ష కంటే ముందే బయటికొచ్చేసింది. వాట్స్ యాప్ వేదికగా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన లీకువీరులు, ఒక్కో ప్రశ్నాపత్రాన్ని రూ.5 లక్షలకు విక్రయించారట. అలహాబాద్ లో ప్రశ్నాపత్రం లీకైందన్న సమాచారంతో ఈ వ్యవహారంలో పాత్ర ఉందన్న అనుమానంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ప్రశ్నాపత్రం లీకైన కారణంగా నిన్న జరగాల్సిన పరీక్ష రద్దైంది. పరీక్ష రద్దుతో ఉద్యోగార్థులు ఆందోళనకు దిగారు.