: ఆ హక్కు మీకు లేదు: విజయవాడ సీపీతో హైకోర్టు
విజయవాడలో రాత్రిపూట గుర్తింపు కార్డు లేకుండా ప్రజలు బయటకు రావద్దని చెప్పే హక్కు పోలీసు కమీషనర్ కు లేదని హైకోర్టు అభిప్రాయపడింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ సీపీ జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, నైట్ డామినేషన్ ను సవాలు చేస్తూ, హైకోర్టులో విజయవాడకు చెందిన న్యాయవాది తానికొండ చిరంజీవి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసును విచారించిన న్యాయస్థానం ఐడీ కార్డు లేకుండా రాత్రిళ్లు బయటకు రావద్దని చెప్పే అధికారం సీపీకి లేదని పేర్కొంది.