: ఫెమినిస్ట్ ఐకాన్ గా ఏంజెలినా జోలీ


బ్రిటన్ లో టాప్ ఫెమినిస్ట్ ఐకాన్ గా హాలీవుడ్ అందాల తార, దర్శకురాలు ఏంజెలినా జోలీ నిలిచారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్న ఆమె మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా ప్రచారం చేస్తున్నందుకుగానూ ఈ ఏడాది బ్రిటన్ ఫెమినిస్ట్ ఐకాన్ గా పేర్కొన్నారు. ఈ అవార్డు కోసం www.roseandwillard.com వెబ్ సైట్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో జర్మన్ కు చెందిన హక్కుల కార్యకర్త గ్రీర్ నుంచి జోలీ గట్టిపోటీ ఎదుర్కొందట. చివరికి జోలీనే ఐకాన్ గా నిలవడం విశేషం. "మేం మహిళా స్వశక్తితోనే ముందుకెళుతున్నాం. వారి ఘనతకు గుర్తింపుగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల హక్కుల విషయంలో ఏంజెలినా చక్కగా పనిచేస్తున్నారు" అని ఫెమినిస్ట్ ఫ్యాషన్ హౌస్ వ్యవస్థాపక అధ్యక్షులు హైడీ రహ్మాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News