: కేంద్ర మంత్రులపై వేలాడుతున్న కత్తి... విస్తరణలో మెహబూబా ముఫ్తీకి చోటు


ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను మరోమారు విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మలిదశ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొంది, ఆశించిన మేర పనితీరు కనబరచనివారికి ఉద్వాసన పలకాలని మోదీ భావిస్తున్నారన్న వార్తలు కేంద్ర మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో విపక్షాల ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక పార్టీనే కాక ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన సచివులకు సెలవు ఇవ్వాల్సిందేనని మోదీ గట్టిగానే నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీతో జతకట్టిన పీడీపీకి తన కేబినెట్ లో చోటిచ్చేందుకు మోదీ దాదాపుగా పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. కాశ్మీర్ సీఎం కూతురు, ఎంపీ మెహబూబా ముఫ్తీకి ఈ దఫా విస్తరణలో చోటు ఖాయమని ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీకి మద్దతిచ్చిన శివసేన ఎంపీలకూ తన కేబినెట్ లో చోటు కల్పించేందుకూ మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో కొత్తవారికి స్థానం కల్పించాలంటే, కొందరికి ఉద్వాసన తప్పదుగా! అందుకే పనితీరు అంతంతమాత్రంగా ఉన్న మంత్రులను సాగనంపక తప్పడం లేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News