: రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులై ఉండి కూడా కోర్టుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేశారన్న కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో, రేవంత్ పిటిషన్ ను నాంపల్లి 3వ మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, వచ్చే నెల 21న వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News