: చికెన్ వద్దు... బీఫ్ కావాలి... నానాయాగీ చేస్తున్న సింహాలు, పులులు
పలాష్... ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో అతిపెద్ద టైగర్. మొన్నటివరకూ రోజుకు సుమారు 7 కిలోల గొడ్డు మాంసాన్ని ఇష్టంగా లాగించేది. మహారాష్ట్రలో గోవధ నిషేధం తరువాత క్రూర జంతువులు ఇష్టమైన ఆహరం కోసం అలమటిస్తున్నాయి. ఒక్క పలాష్ మాత్రమే కాదు, పార్క్ లోని మరో 8 రాయల్ బెంగాల్ జాతి పెద్ద పులులు, 3 సింహాలు, 14 చిరుతలు, 3 రాబందులకు సైతం నిత్యమూ అందించే గొడ్డు మాంసం బదులు అధికారులు కోడి మాంసాన్ని ఇస్తున్నారు. గొడ్డు మాంసం కన్నా చికెన్ తేలికగా ఉండడంతో, జంతువులకు ఆహరం రుచించడం లేదని అధికారులు తెలిపారు. దీంతో కొన్ని జంతువులూ కోపంతో అరుస్తున్నాయని వివరించారు. వీటికి చికెన్ అలవాటు అయ్యేదాకా పరిస్థితి ఇంతేనేమో!