: రాష్ట్రపతి భవన్ లో 'పద్మ' పురస్కారాల ప్రదానోత్సవం... మాలవ్యకు 'భారతరత్న' ప్రదానం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, న్యాయవాది హరీష్ సాల్వేలు రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ స్వీకరించారు. ఇటు క్రీడల్లో పీవీ.సింధు, కళారంగం నుంచి నటుడు కోట శ్రీనివాసరావు, వైద్యరంగంలో డా.అనగాని మంజుల పలువురు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. మొత్తం 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేశారు. మరోవైపు ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్ర్య సమరమోధుడు మదన్ మోహన్ మాలవ్య (మరణానంతరం) కు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులొకరు స్వీకరించారు.