: 'అక్షయ్ కుమార్ స్టంట్' అంటూ విమానం నుంచి దూకిన యువకుడు... 6 గంటల తరువాత అరెస్ట్
అతడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు వీరాభిమాని. పేరు జైన్. మెడికల్ రిప్రజంటేటివ్ గా పని చేస్తున్నాడు. ఓ చిత్రంలో అక్షయ్ చేసినట్టుగా విమానంలో నుంచి కిందకు దూకాలని నిర్ణయించుకున్నాడు. అందుకు హెర్కులస్ సీ 130జె రకం విమానాన్ని ఎంచుకున్నాడు. సుమారు విమానం ఆగిన తరువాత డోర్ తీసీ తీయగానే 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకాడు. ఈ ఘటన మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో జరుగగా, సీసీటీవీల ద్వారా విషయం గమనించిన పోలీసులు రాత్రి 9:30 గంటల సమయంలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాను హీరో అనిపించుకోవాలన్నది జైన్ కోరిక. ముంబైలో ఫ్లైట్ దూకి ఎయిర్ పోర్ట్ బయటకు వెళ్ళిన జైన్, రోడ్డు మార్గంలో గోవా వెళ్లాలని భావించి తొలుత బంద్రాకు, అక్కడినుంచి పొరపాటున బెల్గాం వెళ్లే బస్సు ఎక్కాడు. తప్పు తెలుసుకొని పూణే స్టేషన్ కు క్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని తల్లి ద్వారా తెలుసుకొని గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ముంబై బయలుదేరాడు. అతడి కదలికలు పూర్తిగా ట్రాక్ చేసిన పోలీసులు తూర్పు బాంద్రా సమీపంలోని ఖేర్ వాడి సిగ్నల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్ట్ అతనికి ఏప్రిల్ 4 వరకూ రిమాండ్ విధించింది.