: రాజధాని ప్రణాళికలో సింగపూర్ ప్రభుత్వానికి స్వల్ప మార్పులు సూచించిన చంద్రబాబు... సాయంత్రం ఆ దేశ ప్రధానితో భేటీ


సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన వెంట వెళ్లిన బృందానికి నూతన రాజధాని ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం వివరించింది. ఈ సమావేశానికి సింగపూర్ మంత్రులు, ప్రధాన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు సూచించిన మార్పులతో మరోసారి ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం రూపొందించబోతోంది. మరో 4 లేదా 6 వారాల్లో రాజధాని ప్రణాళికపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రహదారులు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సాయంత్రం సింగపూర్ ప్రధానితో చంద్రబాబు సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News