: కేసీఆర్ హెలికాప్టర్ లో ఇంధనం అయిపోయిందట... మహదేవపూర్ దాకా ఇంధనాన్ని తరలించిన వైనం


ముఖ్యమంత్రుల పర్యటన ఏర్పాట్లలో అధికారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సీఎంలు బయలుదేరే ముందే అన్ని ఏర్పాట్లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అధికారులు, ఒక్కసారి కూడా చెక్ చేసుకోవడం లేదు. దీంతో సీఎంల పర్యటనల్లో పలు ఇబ్బందులతో పాటు సర్కారీ ధనం వృథా అవుతోంది. ఈ తరహా ఘటన నిన్న సీఎం కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా వెలుగు చూసింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం కోసం అధికారులు హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. మూడు రోజుల క్రితం ఖమ్మం వెళ్లిన సీఎం, మరునాడు వరంగల్ చేరుకున్నారు. నిన్న వరంగల్ నుంచి దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరే ముందు హెలికాప్టర్ లో ఇంధనం ఉందా? లేదా? అన్న విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. అసలు హెలికాప్టర్ లో ఎంతమేర ఇంధనం ఉందన్న విషయాన్ని కూడా పరిశీలించలేదు. దీంతో దేవాదుల ప్రాజెక్టు వద్దకు చేరగానే హెలికాప్టర్ లో ఇంధనం అయిపోయింది. తీరా ఇంధనం పూర్తిగా అయిపోయిన తర్వాత మేల్కొన్న అధికారులు, అప్పటికప్పుడు రోడ్డు మార్గం మీదుగా ప్రాజెక్టు సమీపంలోని మహదేవపూర్ వద్దకు ఇంధనాన్ని తెప్పించారు. దేవాదుల నుంచి మహదేవపూర్ వద్దకు వెళ్లిన హెలికాప్టర్, అక్కడ ఇంధనం నింపుకుని తిరిగి దేవాదుల చేరుకుందట.

  • Loading...

More Telugu News