: ఏపీ, తెలంగాణలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం


ఏపీలో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ చక్రపాణి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎన్.రామకృష్ణ, వి.వి.వి చౌదరిలు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు తెలంగాణ శాసనమండలి సభ్యునిగా ఎన్.రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ, తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్, పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలిలో టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

  • Loading...

More Telugu News