: వాహన తయారీలో మూడో స్థానం దిశగా భారత్!: ఫోర్డ్ మోటార్స్ ప్రెసిడెంట్ వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ నయా మంత్రం ‘మేక్ ఇన్ ఇండియా’ పుణ్యమా అని వస్తూత్పత్తిలో భారత్ దూసుకెళుతోంది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో దేశం శరవేగంగా వృద్ధి సాధిస్తోంది. మరో ఐదేళ్లలో వాహన తయారీ రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఎదగనుందట. ఈ విషయాన్ని కార్ల తయారీలో పేరెన్నికగన్న ఫోర్డ్ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్ డేవిడ్ డూబెన్ స్కీ వెల్లడించారు. నిన్న కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 నాటికి భారత్ 70 లక్షల వాహనాలను తయారు చేసే స్థాయిని చేరుకుంటుందని చెప్పారు. తద్వారా భారత్, వాహన తయారీలో మూడో అతిపెద్ద తయారీదారుగా స్థానం సంపాదిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో అమెరికా, చైనాలు ముందు వరుసలో ఉన్నాయి.