: నేడు మదన్ మోహన్ మాలవ్య కుటుంబ సభ్యులకు భారతరత్న ప్రదానం
స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్య (మరణానంతరం)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు భారతరత్న పురస్కారం అందజేయనున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో ఆయన తరపున వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు. గతేడాది డిసెంబర్ 24న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, మాలవ్యలకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రెండు రోజుల కిందట స్వయంగా ఆయన నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి భారతరత్న అందజేసిన సంగతి తెలిసిందే.