: ఏప్రిల్ 6న జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందిస్తాం: మంత్రి కామినేని


ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు ఏప్రిల్ 6న హెల్త్ కార్డులు అందజేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ హెల్త్ కార్డులను అందివ్వనున్నట్టు వెల్లడించారు. గత రాత్రి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బసచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెరుగైన వైద్య సేవల లక్ష్యంతోనే బస చేసినట్టు చెప్పారు. ఈ సంవత్సరం జిల్లా స్థాయి ఆసుపత్రుల అభివృద్ధి కోసం రూ.360 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News