: 'నల్లగా ఉన్నావు' అంటే... గృహహింస కాదు... హైకోర్టు తీర్పు


'నల్లగా ఉన్నావు' అని పదేపదే విమర్శించడం వల్ల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసులో, భర్తను నేరస్థుడిగా భావించలేమని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. తమిళనాడుకు చెందిన పరమశివం, సుధా భార్యాభర్తలు కాగా, సుధ నల్లగా ఉందని పరమశివం దెప్పి పొడుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2001లో సుధ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో వరకట్న వేధింపులు, గృహహింస చట్టం కింద పరమశివంను నిందితుడిగా నిర్ధారిస్తూ, జిల్లా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పరమశివం సవాల్ చేయగా, జస్టిస్ ఎం సత్యనారాయణన్ తాజా తీర్పును వెలువరించారు. నలుపు రంగులో ఉన్నావని భార్యను విమర్శించడం వేధింపులు, హింసించడం కాదని, భార్య ఆత్మహత్య చేసుకునేలా నిందితుడు ప్రేరేపించలేదని పేర్కొంటూ దిగువకోర్టు తీర్పును కొట్టేసింది.

  • Loading...

More Telugu News