: దాచుకున్నది నల్లదనం కాదని హామీ అడుగుతున్న స్విస్ బ్యాంకులు


స్విస్ బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. తమ బ్యాంకుల్లో దాచిన సొమ్ము పన్ను ఎగవేత ద్వారా వచ్చింది కాదనే హామీ పత్రాలను ఇవ్వాల్సిందిగా భారత్‌ కు చెందిన ఖాతాదారులకు స్విస్ బ్యాంకులు సూచించాయి. నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పాటు భారీ ఆదాయం ఉన్న వ్యక్తుల నుంచి ఆడిటర్ ధ్రువపత్రాలనూ అడిగి తీసుకుంటున్నారు. లెక్కల్లో చూపని డబ్బును దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు సురక్షితంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తులైనా, సంస్థలైనా తాము దాచుకున్న డబ్బుపై ఆడిటర్ ధ్రువపత్రాలనూ సమర్పించాల్సి ఉంటుందని బ్యాంకులు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News