: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మరోసారి కవిత ఎన్నిక... కొలువుదీరిన కొత్త కార్యవర్గం
తెలంగాణ సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించిన తెలంగాణ జాగృతి సంస్థకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నిన్న హైదరాబాదులో జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశం కవితను అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇప్పటిదాకా హైదరాబాదు నుంచే కార్యకలాపాలు సాగిస్తున్న తెలంగాణ జాగృతికి జిల్లాల్లోనూ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ కవిత నిర్ణయం తీసుకున్నారు. సంస్థకు సంబంధించి రాష్ట్ర కమిటీకి కొత్త కార్యవర్గంతో పాటు జిల్లాలకు కూడా కార్యవర్గాలను ఆమె ప్రకటించారు.