: చిన్నారిని మింగేసిన హైదరాబాదీ మ్యాన్ హోల్... చందానగర్ లో ఘోరం


లెక్కలేనంత మంది ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపేసిన హైదరాబాదీ మ్యాన్ హోల్స్ మరో చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. నగరంలోని చందానగర్ పరిధిలో గత రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో రెండేళ్ల వయసున్న మహాలక్ష్మి అనే బాలిక మృత్యువాత పడింది. చందానగర్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ స్వగృహ కాలనీలో సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలిక చనిపోయింది. నడుచుకుంటూ వెళుతున్న మహాలక్ష్మి, మూత తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయింది. దీనిని గమనించిన బాలిక తండ్రి, బాలికను కాపాడేందుకు చేసిన యత్నం ఫలించలేదు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News