: న్యూగినియాలో భారీ భూకంపం... సునామీ వచ్చే అవకాశాలు!
పపువా న్యూగినియాలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూ ఉపరితలానికి 65 కిలో మీటర్ల లోతు నుంచి ప్రకంపనలు వ్యాపించాయని, తీరప్రాంతానికి 54 కిలోమీటర్ల మేర ప్రభావం కనిపించిందని వివరించారు. భూకంపం ప్రభావంతో అక్కడి సముద్ర తీరం అలల ప్రకంపనలతో వణికిపోయింది. సునామీ వచ్చే అవకాశాలు అధికంగా ఉండడంతో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. సాల్మన్ దీవులు, న్యూగినియా తీరప్రాంతంలో భూకంప కేంద్రం నుంచి 1000 కిలోమీటర్ల దూరం వరకూ సునామీ అలలు రావచ్చని చెప్పారు.