: ముస్తఫా కమాల్ పై శ్రీనిదే పై చేయి... ఆసీస్ కు ట్రోఫీని బహూకరించిన ఐసీసీ చైర్మన్
వరల్డ్ కప్ విజేతకు ట్రోఫీని అందించే విషయంలో నెలకొన్న వివాదంలో ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్ పైచేయి సాధించారు. నిన్న ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లో జరిగిన ఫైనల్ లో ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బహుమతి ప్రదానోత్సవంలో ఆసీస్ కు ట్రోఫీని నేనిస్తానంటే, కాదు నేనిస్తానని శ్రీని, ఐసీసీ ప్రెసిడెంట్ ముస్తఫా కమాల్ ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందట. ఈ వివాదంలో పైచేయి సాధించిన శ్రీని... ఆసీస్ కు ట్రోఫీని బహుకరించి, ఐసీసీలో తన ప్రాబల్యాన్ని మరోమారు నిరూపించుకున్నారు.