: సచిన్ మైనపు బొమ్మను తీసేశారు... సిడ్నీ నుంచి తరలించిన టుస్సాడ్స్ మ్యూజియం!


క్రికెట్ లెజెండ్ గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైనపు ప్రతిమను మేడ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సందర్భంగా యావత్తు క్రీడా జగత్తు గర్వంతో పొంగిపోయింది. అదే టుస్సాడ్స్ మ్యూజియం తీసుకున్న అనాలోచిత నిర్ణయం, ప్రస్తుతం క్రీడాభిమానులను షాక్ కు గురి చేస్తోంది. అసలు విషయమేంటంటే, సిడ్నీలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సచిన్ మైనపు బొమ్మ గతంలోనే ఏర్పాటైంది. మ్యూజియాన్ని సందర్శించే ప్రతి సందర్శకుడు సచిన్ ప్రతిమ వద్ద నిలబడి ఫొటోలు తీసుకుని మురిసిపోయేవారు. అయితే కొన్ని నెలలుగా మ్యూజియంలో సచిన్ బొమ్మ లేదట. కారణమేంటని ఆరా తీస్తే, తమ ఇతర శాఖకు సచిన్ ప్రతిమను తరలించామని టుస్సాడ్స్ తాపీగా సమాధానమిచ్చింది. మేడం టుస్సాడ్స్ కు ప్రపంచంలోని పలు నగరాల్లో శాఖలున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రముఖుల మైనపు బొమ్మలను ఒక శాఖ నుంచి మరో శాఖకు తరలించడం సర్వసాధారణమని కూడా టుస్సాడ్స్ పేర్కొంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సచిన్ మైనపు బొమ్మను ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారని క్రీడాభిమానులు టుస్సాడ్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News