: కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు కేసీఆర్ భరోసా... పరిహారం చెల్లించాకే పనులు చేపడతామని హామీ!


తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం కేసీఆర్ గట్టి భరోసానే ఇచ్చారు. నిన్న వరంగల్ లో పర్యటించిన ఆయన, కంతనపల్లి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతంలోనే ఆయన అధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న వారికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించిన తర్వాతే, ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు 5 రెట్ల పరిహారాన్ని కూడా అందజేయాలని నిర్ణయించారు. ఈ పరిహారాన్ని త్వరితగతిన చెల్లించేందుకు ఏప్రిల్ 15 లోగా నిర్వాసితుల జాబితాను సిద్ధం చేయాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News