: నవ్యాంధ్ర రాజధానిపై తుది కసరత్తు షురూ... సింగపూర్ బయలుదేరిన చంద్రబాబు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఆర్థిక, పురపాలక శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్, పలువురు అధికారులతో కలిసి ఆయన సింగపూర్ పయనమయ్యారు. సింగపూర్ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ పై చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధి బృందంతో తుది దశ చర్చలు జరుపుతారు. ఇప్పటికే సిద్ధమైన మాస్టర్ ప్లాన్ పై సమీక్ష చేయనున్న చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధి బృందానికి మార్పులు, చేర్పులను సూచిస్తారు. చంద్రబాబు బృందానికి నేటి ఉదయం ఆ దేశ మంత్రి షణ్ముగం అల్పాహార విందు ఇవ్వనున్నారు. నాలుగు రోజుల క్రితమే సింగపూర్ వెళ్లాలని భావించిన చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తన ట్రిప్ ను నేటికి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News