: రన్ వేపై ల్యాండ్ అవుతుండగా జారిన ఎయిర్ కెనడా జెట్... ప్రయాణికులకు గాయాలు
కెనడాలోని నోవా స్కాటియాలో ఉన్న ప్రధాన ఎయిర్ పోర్టు హాలిఫాక్స్ రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఎయిర్ కెనడా జెట్ ఒకటి స్కిడ్ అయింది. ఈ ఘటనలో 23 మంది ప్రయాణికులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తూర్పు కెనడియన్ నగరంలో భారీగా మంచు పడుతోందని, వాతావరణం సరిగా లేదని, దానివల్ల అంతగా దారి కనబడదని అంతకుముందే హెచ్చరిక చేశారట. ఈ కారణంగానే విమానం ల్యాండింగ్ సమయంలో జారీ పడుంటుందని చెబుతున్నారు. మొత్తం ఐదుగురు సిబ్బంది, 133 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారని ఎయిర్ కెనడా వెల్లడించింది.