: కాశ్మీర్ లో భారీ వర్షాలు... పలు ప్రాంతాలు జలమయం
కాశ్మీర్ వ్యాలీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీనగర్ లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి. చాలాచోట్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి మూసుకుపోయింది. 18 ఇళ్లు సహా 44 నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో స్థానిక జీలం నది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది.