: రేపటి నుంచి చంద్రబాబు సింగపూర్ పర్యటన


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి (సోమవారం) నుంచి రెండు రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. ప్రభుత్వం తరపున ఓ ప్రతినిధి బృందం ఆయన వెంట వెళుతుంది. గత ఐదు నెలల్లో సీఎం రెండోసారి సింగపూర్ వెళుతున్నారు. తొలిరోజున ముందుగా సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగంతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆ దేశ మార్కెట్, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ తో బాబు చర్చిస్తారు. ఆ తరువాత జరగనున్న బిజినెస్ సెమినార్ లో పాల్గొని పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో బాబు మాట్లాడతారని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News