: నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోండి... రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం
నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని రాష్ట్రాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి అన్ని రాష్ట్రాలకు తక్షణసాయం కింద రూ.5,270 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రాలకు తెలిపింది. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం... వర్షాభావ ప్రాంతాల్లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో హెక్టారుకు రూ.4,500, నీటిపారుదల పుష్కలంగా ఉన్న ప్రాంతాలకు రూ.9,000, శాశ్వత పంటలకు ఎకరానికి రూ.12,000 ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే విపత్తు నిర్వహణ నిధిలోని నిధులకంటే వ్యయం ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంటే తమకు నివేదిక సమర్పించాలని కేంద్రం సూచించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా రబీ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా 13 రాష్ట్రాల్లోని 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని కేంద్రం తెలిపింది.