: విశాఖ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు... ఐదుగురి మృతి
విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం, గోకులపాడులోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. పదిమందివరకు తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఇంకా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎస్.రాయవరం నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. బాణాసంచా కేంద్రం విశాఖ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలోని గోకులపాడు శివార్లలో ఉందని తెలిసింది. రెండు నెలల కిందట ఇక్కడే ఓ ప్రమాదం జరగ్గా ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అంటున్నారు.