: యూపీ ఎమ్మెల్యేలకు చీపుర్లు, పెన్నులను బహుమతిగా ఇచ్చిన అజంఖాన్
ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపే ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్, ఈసారి పార్టీ ఎమ్మెల్యేలకు చీపుర్లు, పెన్నులను బహుమతులుగా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, వాటితో పాటు ఓ లేఖ కూడా ఇచ్చారు. ఈ రెండింటిలో సమాజంలోని దుశ్చర్యలను ఏది తుడిపేస్తుందో మీరే నిర్ణయించుకోవాలని ఆయన లేఖలో కోరారు. "నేను మీకు రెండు బహుమతులు (పెన్ను, చీపురు) ఇస్తున్నా. ఈ సమాజంలోని పాపాలను ఈ రెండింటిలో ఏది నిర్మూలిస్తుందో, అంతేగాక కేవలం నినాదాల ద్వారానే మిమ్మల్ని ఈ సమాజంలో ఏది గుర్తు చేస్తుందో నిర్ణయించుకోవాలి" అని అజంఖాన్ పేర్కొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' నినాదానికి ప్రతిగానే ఖాన్ ఈ బహుమతి ఇచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. కొన్ని రోజుల కిందట యూపీ శాసనసభ సమావేశాల్లో అజం మాట్లాడుతూ, 'ప్రజలకు ప్రధాని చీపురు ఇచ్చి, వారి చేతుల్లో నుంచి కలాన్ని లాక్కున్నా'రంటూ వ్యాఖ్యానించారు.