: 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఫాల్కనర్... 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' స్టార్క్
ప్రపంచకప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ ఫాల్కనర్ అత్యధిక వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లతో టైటిల్ అందుకున్నాడు. ఇక ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. మెల్ బోర్న్ లో మ్యాచ్ జరిగిన స్టేడియంలో పురస్కారాల ప్రదానోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్ హోదాలో హాజరైన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వారిద్దరికీ టైటిల్ పురస్కారాలను అందజేశాడు. తరువాత ఐసీసీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వరల్డ్ కప్ ట్రోఫీని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కు అందజేశాడు.