: కోర్టు ఉత్తర్వుల మేరకే 'మా' ఫలితాలు వెల్లడిస్తాం: ఎన్నికల అధికారి


సిటి సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకే 'మా' ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల నిర్వహణాధికారి కృష్ణ మోహన్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చాకే ఈవీఎంలు తెరుస్తామని చెప్పారు. మొత్తం 7 ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించామని, చిత్రీకరించిన ఎన్నికల ప్రక్రియను ఈ నెల 31న కోర్టుకు అందిస్తామని తెలిపారు. 'మా' ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఈసారి 394 ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు 'మా' పోలింగ్ ముగిసింది.

  • Loading...

More Telugu News