: ఐదోసారి ట్రోఫీతో సగర్వంగా ఆస్ట్రేలియా


న్యూజిలాండ్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఐదవసారి క్రికెట్ విశ్వ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు గతంలో 1987, 1999, 2003, 2007 సంవత్సరాల్లో ప్రపంచ కప్ పోటీలలో విజేతగా నిలిచింది. 1987లో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్ పోరులో బోర్డర్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 7 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ట్రోఫీని అందుకుంది. ఆ తరువాత 1999లో లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్ తో స్టీవ్ వా కెప్టెన్సీలో తలపడిన టీం 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆపై రికీ పాంటింగ్ నేతృత్వంలో 2003 లో ఇండియాపై (జోహాన్స్ బర్గ్ - వాండరర్ మైదానంలో - 125 పరుగుల తేడాతో), 2007లో శ్రీలంకపై (ఓవల్ మైదానం - 53 పరుగుల తేడాతో - డీ/ఎల్ పద్ధతిలో) విజయం సాధించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో 3 వరుస విజయాలు నమోదు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. తిరిగి నేడు సొంత గడ్డపై మెల్ బోర్న్ మైదానంలో న్యూజిలాండ్ ను ఓడించి ఐదవసారి సగర్వంగా ట్రోఫీని అందుకుంది.

  • Loading...

More Telugu News