: 2015 క్రికెట్ విశ్వ విజేత ఆస్ట్రేలియా
మెల్ బోర్న్ వేదికగా, సొంత మైదానంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి వరల్డ్ కప్ క్రికెట్ విశ్వ విజేతగా నిలిచింది. తొలుత న్యూజిలాండ్ జట్టును 183 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా, 184 పరుగుల సునాయాస లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో 186 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ 45, ఫించ్ 0, క్లార్క్ 74 పరుగులు చేయగా, స్మిత్ 56, వాట్సన్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 2, బౌల్ట్ 1 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ పై విజయం తరువాత మెల్ బోర్న్ స్టేడియం బాణసంచా వెలుగులతో నిండిపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.