: కన్నీటితో వెనుదిరిగిన క్లార్క్
తన కెరీర్లో చివరి వన్ డే మ్యాచ్ ఆడుతున్న క్లార్క్ 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హెన్రీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మైదానాన్ని వీడుతున్న క్లార్క్ కు మెల్ బోర్న్ స్టేడియంలోని వేలాది మంది లేచి నిలబడి వీడ్కోలు పలుకగా, కన్నీరు నిండిన కళ్ళతో బౌండరీ రోప్ ను దాటాడు. మైదానంలోని ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఆస్ట్రేలియా జట్టు విజయానికి మరో 9 పరుగులు చేయాల్సి ఉంది.