: ఆమ్ ఆద్మీ పార్టీలో భారీ మార్పులు... పలువురికి ఉద్వాసన
ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దాంతో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు మరికొంతమందికి ఆప్ ఉద్వాసన పలికింది. ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను జాతీయ క్రమశిక్షణ సంఘం తొలగించింది. ఇక అంతర్గత లోక్ పాల్ పదవి నుంచి అడ్మిరల్ రామ్ దాస్ ను కూడా తొలగించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కొత్త లోక్ పాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.