: తన చివరి వన్ డే పోటీలో క్లార్క్ హాఫ్ సెంచరీ... విజయానికి దగ్గరవుతున్న ఆస్ట్రేలియా!
న్యూజిలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా జట్టు విజయానికి దగ్గరవుతోంది. తన కెరీర్లో చివరి వన్ డే మ్యాచ్ ఆడుతున్న క్లార్క్ అర్ధ సెంచరీతో రాణించాడు. మొత్తం 56 బంతులను ఎదుర్కొన్న క్లార్క్ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. క్లార్క్ కు మద్దతుగా మరో ఎండ్ లో స్మిత్ 35 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు.