: 100 పరుగులు దాటిన ఆసీస్ స్కోరు
184 పరుగుల లక్ష్యంతో ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా వంద పరుగుల మైలురాయిని దాటింది. 21వ ఓవర్లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ బౌలింగులో ఆసీస్ సెంచరీ మార్క్ అధిగమించింది. ప్రస్తుతం మైకేల్ క్లార్క్ (22), స్టీవెన్ స్మిత్ (26)ల భాగస్వామ్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా స్కోర్ 22 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు. ఆసీస్ విజయ లక్ష్యానికి ఇంకా 81 పరుగులు చేయాల్సి ఉంది.