: ముగిసిన మా పోలింగ్... జోరుగా బెట్టింగులు!


సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా జరిగిన 'మా' ఎన్నికలు ముగిశాయి. పలువురు అగ్రహీరోలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఓట్లు వేసిన వారి సంఖ్య సైతం 57 శాతంగా నమోదైంది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ మొత్తాన్నీ వీడియో షూటింగ్ తీశారు. మొత్తం 6 ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లను వినియోగించారు. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ల మధ్య ప్రధాన పోటీ ఉండగా, ఎవరు గెలుస్తారన్న విషయంపై జోరుగా బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరు గెలిచినా సినీ పరిశ్రమ మొత్తం ఒకటేనని అటు రాజేంద్ర ప్రసాద్, ఇటు జయసుధ ప్రకటించారు. మొత్తం 394 ఓట్లు పోల్ అయినట్టు 'మా' ప్రకటించింది.

  • Loading...

More Telugu News